ఎమ్మిగనూరు సమీపంలో బనవాసి ఫారం నందు మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జగనాగేశ్వర్ రెడ్డి వినతి పత్రాన్ని అందించారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని సమస్యలపై విన్నవించారు.గురు రాఘవేంద్ర ప్రాజెక్టు,గాజులదిన్నె ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాలని కోరారు.