ఆదోని: కూటమి ప్రభుత్వం బీసీల పక్షపాతి: ఎమ్మెల్యే పార్థసారథి

58చూసినవారు
కూటమి ప్రభుత్వం బీసీల పక్షపాతి అని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. శనివారం ఆదోనిలోని క్యాంపు కార్యాలయంలో కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రిని సన్మానించి, మాట్లాడారు. ఆదోని వారికి చైర్మన్ పదవులు రావడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని, కూటమి అలా చేయదన్నారు. మల్లప్ప, రమేష్, కునిగిరి నీలకంఠ, గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్