బీజేపీ నేతలపై తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఫైర్ అయ్యారు. శుక్రవారం విజయవాడలో ఆయన మాట్లాడారు. చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఒళ్లు, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. బీజేపీ నేతలకు బస్సులు తగలబెట్టి సంస్కృతి లేదని, బీజేపీ, అనుబంధం సంస్థలపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు.