ఆదోనిలో వైఎస్సార్సీపీ నాయకులు భూదందాలు, భూ కబ్జాలకు పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదని, బహిరంగ విచారణకు తాను సిద్ధమని ఎమ్మెల్యే పార్థసారథికి ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆదోనిలో ఆయన మాట్లాడారు. అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ఎమ్మెల్యే సాయినామ జపం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తను భూకబ్జాలకు పాల్పడి ఉంటే ఆధారాలతో నిరూపించాలన్నారు.