ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో మీకు తెలుసా ..? కార్యక్రమంలో భాగంగా.. జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం వారి మార్గదర్శకంలో చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమం, వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, స్టేట్ ఎన్జీవోస్ లీడర్ దస్తగిరి రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.