ఆలూరు మేజర్ గ్రామపంచాయతీలో షాపింగ్ కాంప్లెక్స్ వేలాలు గురువారం ప్రశాంతగా ముగిశాయి. సర్పంచ్ అరుణాదేవి, పత్తికొండ డీఎల్పీఓ సమక్షంలో 27 షాపులకు వేలం నిర్వహించారు. నేషనల్ రూర్బన్ మిషన్ కింద రూ. 1.20 కోట్లతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను నాలుగేళ్లుగా అనివార్య కారణాలతో వేలాలు వాయిదా పడ్డాయన్నారు. వేలాల ద్వారా గ్రామ పంచాయతీకి ప్రతి నెలా రూ. 1.20 లక్షలు, ఏడాదికి రూ. 14.58 లక్షలు ఆదాయం సమకూరుతుందన్నారు.