ఈనెల 29వ తేదీన జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవం వేడుకల్లో భాగంగా చిప్పగిరి మండల పరిధిలోని నేమకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను మంగళవారం ప్రారంభించారు. పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల్లో క్రీడా ఆసక్తిని పెంపొందించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎంఎండి భాషా తెలిపారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తామని తెలిపారు.