యాగంటిలో ప్రారంభమైన యాగంటి శివదీక్షలు

63చూసినవారు
యాగంటిలో ప్రారంభమైన యాగంటి శివదీక్షలు
నంద్యాల జిల్లాలోని బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి శివదీక్ష మాలధారణ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా వైయస్సార్ సీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ఉదయాన్నే దేవస్థానం వచ్చి శివదీక్ష స్వీకరించారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలదీక్ష (41 రోజులు) పాటించి మహ శివరాత్రికి దీక్ష విరమిస్తారు.

సంబంధిత పోస్ట్