సమాజంలో మహిళలను గౌరవిస్తే సమాజమే కాకుండా దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఏపీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి. శేబారాణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై ఎల్లయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని శనివారం బేతంచెర్ల సిఐటియు కార్యాలయము నందు, అంగన్వాడి మండల కార్యదర్శి ఎన్ కె నాగలక్ష్మి, ఎస్ గుల్జార్ బిల అధ్యక్షతన మహిళలతో సమావేశం నిర్వహించడం జరిగింది.