బేతంచర్ల పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, సుందరయ్య కాలనీ, అల్లా బకాష్ దర్గా కాలనీలలో త్రాగునీటి సమస్య, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ పట్టణ మండల కార్యదర్శులు వైబి. వెంకటేశ్వర్లు, ఎం. మధు శేఖర్ సంబంధిత అధికారులను శనివారం కోరారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర లో భాగంగా ఆయా కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సిపిఎం పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.