డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపింది. నిధుల కోసం దుండగులు ఆలయంలో పూరాతన విగ్రహాలను ధ్వంసం చేశారు. గురువారం డోన్ రూరల్ పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పురాతన కోనేరులో ఉన్న శివలింగాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. గతంలో కూడా దుండగులు ఈ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు స్థానికులు తెలిపారు.