యాగంటి పార్వేట ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. యాగంటి చుట్టుపక్కల గ్రామాలు పాతపాడు, వీరాపురం, సాదు కొట్టం, మాదాసుపల్లి, యాగంటిపల్లి గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. బనగానపల్లె మండలంలో కనుమ రోజు స్వామి వారి ఉత్సవాలు నిర్వహిస్తామని అర్చకులు బుధవారం తెలిపారు. స్వామి కొండ దిగి మా గ్రామాలకు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.