గిడ్డాంజనేయస్వామిని దర్శించుకున్న కుడా చైర్ మన్ కోట్ల

78చూసినవారు
కోడుమూరు మండలంలోని వెంకటగిరి గ్రామంలో వెలసిన శ్రీగిడ్డాంజినేయస్వామిని కుడా చైర్ మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ దర్శించుకున్నారు. బుధవారం వారికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గోపాల్ రెడ్డి, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో జరిగిన ఉగాది వేడుకల్లో వారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్