కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని, కర్నూలు నుంచి బళ్లారి వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. కోడుమూరు పట్టణంలోని స్థానిక కోట్ల సర్కిల్లో సీపీఎం, సీపీఐ నాయకులు రాజు, గఫూర్ మియ్యా ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.