కర్నూలు: బీసీ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి

65చూసినవారు
కర్నూలు: బీసీ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి
బీసీ హాస్టల్ విద్యార్థులకు రోజుకు రూ. 150 మెస్ ఛార్జీ, నెలకు రూ. 500 కాస్మోటిక్ ఛార్జీ పెంచాలని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఉప్పర నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఆయన, బీసీ హాస్టల్స్‌కు శాశ్వత భవనాలు, లేడీస్ హాస్టల్స్‌కు భద్రతా సిబ్బంది నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. పోటీ పరీక్షల ఫీజు సడలింపు బీసీ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్