మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు మండలంలో నీటి సంఘం ఎన్నికల సందడి మొదలైంది. శనివారం ఎన్నికల ప్రక్రియలో భాగంగా పెద్దకడబూరు మండలంలోని ఐదు సాగునీటి సంఘాల ఎన్నికలకు రైతులు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వైసీపీ అధిష్ఠానం సాగునీటి ఎన్నికలను బహిష్కరించడంతో ఆ పార్టీ నేతలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలు ఏకపక్షంగా మారాయి. టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.