పెద్దకడబూరు మండలంలోని నౌలేకల్లో శుక్రవారం తహశీల్దార్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై వినతులు స్వీకరించి, 45 రోజుల్లో పరిష్కరిస్తామని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రైతుల నుంచి వినతులు స్వీకరించారు. ఇందులో గ్రామస్థులు పాల్గొన్నారు.