కాదిరేలయ్య పీర్లకు ప్రత్యేక పూజలు

66చూసినవారు
మొహరం వేడుకలలో భాగంగా మంగళవారం పెద్దకడబూరు గ్రామంలో కొలువైన కాదిరేలయ్య పీర్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామున నుండి గ్రామంలోని ఆయా కాలనీల్లో భక్తుల ఇళ్లను సందర్శించి ప్రత్యేక పూజలు అందుకున్నారు. పీర్ల దేవునికి భక్తులు పూలు, దుస్తులు మొక్కుబడిగా సమర్పించారు. గ్రామంలో ప్రధాన రహదారి వెంబడి ఊరేగారు. ఇందులో కుల మతాలకు అతీతంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్