నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం రెండవ రోజు నియోజకవర్గస్థాయి బాలికల స్కూల్ గేమ్స్ కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ షేక్ షావలి, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఉషారాణి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపు ఓటములలో సమానంగా స్వీకరించాలని అన్నారు.