వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాటలు శకుని పాత్ర పోషించేలా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం జూపాడు బంగ్లా మండలం తరిగోపుల గ్రామ మజర రామసముద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గ్రామ దేవత సుకుల పరమేశ్వరి ఆలయాల నిర్మాణాలకు గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు.