గాజులపల్లిలో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం

85చూసినవారు
గాజులపల్లిలో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం
పరిసరాల అపరిశుభ్రతపై నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, నంద్యాల- గిద్దలూరు జాతీయ రహదారిలో చెత్తను శుభ్రం చేశారు. అనంతరం నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారిలో దుకాణాదారులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్