నంద్యాల పట్టణంలో ఆదివారం ఆపద్బాంధవ సేవ సొసైటీ 9వ వార్షికోత్సవం అధ్యక్ష కార్యదర్శులు గోళ్ళ సుదర్శనం, యోలుకూరు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సొసైటీ నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందజేస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలామంది పేద విద్యార్థులు డాక్టర్ వృత్తి, సాఫ్ట్ వేర్, వివిధ రంగాల్లో స్థిరపడినట్లు వారు తెలిపారు. ఇప్పటివరకు 67 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు వారు తెలిపారు