కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించి వక్రీభవన లోపాలు ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం కంటి అద్దాలను పంపిణీ చేస్తుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. శుక్రవారం నంద్యాల క్రాంతి నగర్ లోని ఏపీ మోడల్ స్కూల్ లో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.