రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, నంద్యాల జిల్లా అధ్యక్షులు కన్నయ్య, ప్రధాన కార్యదర్శి హుస్సేన్ మియా ఆధ్వర్యంలో పలువురు భాషోపాధ్యాయులు శుక్రవారం నంద్యాల డివిజన్ నూతన ఉప విద్యాశాఖాధికారి శంకర్ ప్రసాద్ ని కలిసి సత్కరించారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 18వ తేదీ నుంచి నిర్వహించే భాషోత్సవాలను విజయవంతం చేయాలని నంద్యాల ఉపవిద్యాధికారి శంకర్ ప్రసాద్ ను ఉపాధ్యాయులను కోరారు.