నంద్యాల పట్టణంలోని పి.ఎస్.సి. అండ్ కె.వి.ఎస్.సి ప్రభుత్వ కళాశాలలో శనివారం ప్రిన్సిపాల్ శశికళ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్యార్థులకు స్వచ్ఛత మరియు పరిసరాల స్వచ్ఛత ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి, కళాశాల అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులతో కలసి కళాశాల ప్రాంగణాన్ని శుభ్రపరిచారు.