శ్రీశైల మహా క్షేత్రంలో మంగళవారం నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో రూ. 6,09,85,947 ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 5 నుంచి 31వ తేదీ వరకు సంబంధించిన మొత్తం 27 రోజులకు గానూ ఈ ఆదాయం సమకూరినట్లు చెప్పారు. అలాగే 200 గ్రాముల వందమిల్లి గ్రాముల బంగారు, 6 కేజీల 200 గ్రాముల వెండితో పాటు పలు విదేశాలకు చెందిన కరెన్సీలు సమకూరినట్లు వెల్లడించారు.