గడివేముల మండలంలోని మంచాలకట్ట గ్రామంలో చెరువుకు శనివారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నీటిని విడుదల చేశారు. ఎస్సార్బీసీ నుంచి ఎత్తిపోతల పథకాన్ని స్విచ్ ఆన్ చేసి చెరువులోకి నీటిని విడుదల చేశారు. ఆమె మాట్లాడారు. త్వరలోనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేస్తామన్నారు. గండిపడిన అలుగనూర్ రిజర్వాయర్ పనులకు రూ. 34 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.