కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని రాతివనంలో గురువారం హిందూపురం ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ సినిమా షూటింగ్ నిర్వహించారు. రెండు రోజులపాటు పలు సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సితారా ఎంటర్‌ప్రైజెస్ ప్రొడక్షన్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా, బాబీ దర్శకత్వంలో ప్రత్యజ్ఞజ్వాలా హీరోయిన్‌గా ఎన్‌బీకే 109 ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌తో భాగంగా ఒక పాటతోపాటు కొన్ని విలన్ సన్నివేశాలను ఇక్కడ షూట్ చేశారు. బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో పెద్ద ఎత్తున్న అభిమానులు తరలివచ్చారు.