ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో వెలసిన భ్రమరాంబ, శ్రీబుగ్గ రామేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ తో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలతో నిర్వహించి, దేవస్థానానికి సంబంధించిన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. రానున్న శివరాత్రికి వైభవంగా ఉత్సవాలు చేస్తామన్నారు.