పత్తికొండ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సమీక్ష

80చూసినవారు
పత్తికొండ పట్టణంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఉపాధి హామీ పనులపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. జూన్ నుంచి జూలై వరకు చేపట్టాల్సిన ఉపాధి పనులపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎంపీడీవో సువర్ణలత, ఏపీవో వెంకటేశ్వర్లు, ఏపీడీవో పకీరప్ప, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్