తుగ్గలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం గుత్తి, పత్తికొండ ప్రధాన రహదారిలో తుగ్గలి వద్ద బైక్ లారీని ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న అనంతపురం జిల్లా గంగవరంకు చెందిన కృష్ణ (38) అక్కడికక్కడే మృతి చెందగా, మరొక వ్యక్తి గోవిందు గాయపడినట్లు ఎస్సై తెలిపారు. గాయపడిన గోవిందును చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.