వెలుగోడు మండల పరిషత్ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు బుధవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ కోమల ఆధ్వర్యంలో కిషోర్ వికాసం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ పిడి వి. లీలావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిషోర్ కిషోర ఆ బాలికల భవిష్యత్తు మెరుగుపరచడానికి వారికి ఉన్నత విద్యను అందించడానికి తల్లిదండ్రులను ప్రోత్సహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, అన్ని శాఖ అధికారులు పాల్గొన్నారు.