ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి, క్రీడాకారులను పరిచయం చేసుకొని, కబడ్డీ ఆడుతూ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ ఆర్గనైజర్లు టీడీపీ నాయకులు, పార్టీ కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.