రోడ్డు భద్రత నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించగలమని ఎమ్మిగనూరు పట్టణ సీఐ శ్రీనివాసులు గురువారం పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆర్టీసీ డిపోలో నేటి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరుపుకుంటున్నారన్నారు. డిపో మేనేజర్ అమర్నాథ్ మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ ప్రమాదరహితంగా ఉండాలని తను విధులకు అరగంట ముందు వచ్చి బస్సును పరీక్షించుకోవాలన్నారు. ముస్తాక్ అహ్మద్, సిబ్బంది పాల్గొన్నారు.