ఎమ్మిగనూరు మండలంలో బనవాసి గ్రామంలో పాముకాటుకు గురైన కురువ రామలక్మి (29) శుక్రవారం మృత్యువాత పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోరారు. మృతురాలు గత నాలుగు రోజుల క్రితం ఇంట్లో నిద్రిస్తుండగా పాముకాటుకు గురైంది. చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.