AP: రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ వేశారు. ‘గత ప్రభుత్వమే మద్యం షాపులు, బెల్టు షాపులు నిర్వహించింది. నాసిరకం మద్యం బ్రాండ్లు సరఫరా చేసింది. గత ప్రభుత్వ లిక్కర్ పాలసీ వల్ల ఎంతో మంది చనిపోయారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపడం వల్లే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయి.’ అని మంత్రి కొల్లు అన్నారు.