బంగాళాఖాతంలో అల్పపీడనాలు, రాష్ట్రంలో ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు లేకపోవడంతో రుతుపవనాలు బలహీనంగా మారాయి. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకోస్తా తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.