ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ

73చూసినవారు
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ
AP: బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. భారీ క్రేన్ సహాయంతో వాహనాలను రోడ్డు మీద నుంచి తొలగించారు. దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్