'కుంభమేళాలో ఓ కుటుంబానికి రూ.30 కోట్ల ఆదాయం'

72చూసినవారు
'కుంభమేళాలో ఓ కుటుంబానికి రూ.30 కోట్ల ఆదాయం'
ప్రయాగ్‌రాజ్‌లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారని సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీలో స్పందించారు. 'పడవ నడిపే ఓ వ్యక్తి విజయగాథను నేను పంచుకోవాలని అనుకుంటున్నా. అతడి కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. కుంభమేళాలో ఒక్కో పడవతో రోజుకు రూ.50వేల నుంచి రూ.52వేల వరకు సంపాదించారు. 45 రోజులకు ఒక్కో పడవతో దాదాపు రూ.23లక్షల చొప్పున ఆదాయం రాగా అలా మొత్తంగా 130 పడవలతో రూ.30 కోట్లు ఆర్జించారు' అని యోగి వివరించారు.

సంబంధిత పోస్ట్