ప్రస్తుతం యువత సోషల్ మీడియాకు పూర్తిగా బానిసలైపోయారు. ఈ క్రమంలో ఫేమస్ కావడానికి, వ్యూస్ కోసం అనేక తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి వంట చేస్తూ.. రీల్స్ చేయాలనుకుంది. గ్యాస్‌కు ఎదురుగా ఫోన్ పెట్టడానికి ముందుకు వంగింది. గ్యాస్ ఆన్‌లో ఉందన్న విషయం కూడా మరచిపోయింది. ఈ క్రమంలో మంటలు చున్నికి అంటుకున్నాయి. దీంతో ఆమె అక్కడ నుంచి పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.