డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు!

58చూసినవారు
డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు!
AP: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల నిమిత్తం 5 శాతం వడ్డీతో రూ.లక్ష రుణం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలకు సీఎంవో ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే మహిళ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారట.

సంబంధిత పోస్ట్