కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆదోనిలో వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 13న రైతులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తామని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు దగా చేస్తుందని విమర్శించారు. సూపర్ సిక్స్ ఎన్నికల హామీలపై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.