ఆదోని: బియ్యం స్మగ్లింగ్ జగన్ తోనే మొదలైంది: ఎమ్మెల్యే

64చూసినవారు
బియ్యం స్మగ్లింగ్ జగన్ తోనే మొదలైంది ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. గురువారం విజయవాడలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు బీజేపీ నిర్వహిస్తున్న వారధి కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొని, బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే బియ్యం స్మగ్లింగ్ షిప్ ల ద్వారా చేశారని ఆరోపించారు. తీర ప్రాంతాల నుంచి షిప్ లతో బియ్యం తరలించడం అందరూ చూశారన్నారు.

సంబంధిత పోస్ట్