వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. శనివారం ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు బైపాస్ రహదారిపై ఈ ఘటన జరిగింది. నాగలాపురం గ్రామానికి చెందిన రైతులు తమ స్వగ్రామానికి వరిగడ్డి తీసుకువెళ్ళే సమయంలో ఆదోని బైపాస్ రోడ్డు టర్నింగ్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. గాయాలపాలైన ముగ్గురిని సమీప ఆస్పత్రికి తరలించారు.