

ఆదోని: రూ. 50 లక్షల డిమాండ్, పోలీసులపై దాడి నిందితులు అరెస్టు
ఆదోని పట్టణంలోని మధు హాస్పిటల్ యజమాని గురురెడ్డిని రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఇద్దరు నిందితులను శనివారం వన్ టౌన్ సీఐ శ్రీరామ్ అరెస్టు చేశారు. ఆయన మాట్లాడారు. బసాపురానికి చెందిన రఘునాథ్, అడివేశ్ అనే వ్యక్తులు ఆరోగ్యశ్రీ పథకం అవకతవకలు బయటపెడతామన్న బెదిరింపులతో గురురెడ్డికి డబ్బు డిమాండ్ చేశారు. నోటీసు ఇచ్చేందుకు వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపరిచినట్లు సీఐ తెలిపారు.