ఆదోని: పరిశ్రమలతో పాటు కబ్జాలకు అంతే పాపులర్
ఆదోనిలో పరిశ్రమలకు ఎంత ప్రాచుర్యమో, కబ్జాలకు అంత పాపులర్ అని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో ఆదోని నియోజకవర్గంలో ఆటోనగర్ కార్మికుల సమస్యలపై చర్చించారు. గత పాలకుల పాలనలో ఆదోని కబ్జాలకు కేంద్రంగా మారిందని దుయ్యబట్టారు. గత వైసీపీ ఎమ్మెల్యే చేసిన పనికి ఆదోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి అన్నారు.