ఆదోని: చలో కలెక్టరేట్ కు సంబంధించిన కరపత్రాలు విడుదల

52చూసినవారు
ఆదోని పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం చలో కలెక్టరేట్‌కు సంబంధించిన కరపత్రాలను ఎస్ఎఫ్ఐ నాయకులు విడుదల చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస మాట్లాడుతూ, విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై నవంబర్ 6న చలో కలెక్టరేట్‌కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ప్రతి విద్యార్థి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు శశి, గౌస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్