గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు సక్రమంగా అందించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదోని ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రిని కలెక్టర్ తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. పీపీటీసీ గది, యాంటినేటల్, రిజిస్ట్రేషన్ నమోదు కేంద్రం, నవజాత శిశువు సంరక్షణ విభాగం, పోస్టు ఆపరేటివ్ వార్డు-1, మెడికల్ రికార్డు రూమ్, గైనకాలజీ వార్డులను తనిఖీ చేశారు.