పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు హర్షించదగినవి కావని ఆయన వెంటనే రాజీనామా చేయాలని తాలూకా కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బరగొడ్ల హుస్సేన్ బాషా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ శంషుల్ హక్ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.