కర్నూలు జిల్లా ఆలూరు మండలం ముద్దనగేరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తగిలి శ్రీను (27) అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు 6 నెలల క్రితం బెంగళూరుకు వెళ్లి, ఆలూరు పెట్రోల్ బంకులో ఇటీవల పనిచేయడం ప్రారంభించాడు. ఈ అనుకోని ఘటనతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.